రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘RRR’. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ఆర్ మార్చి 25న రిలీజ్ అయ్యింది.
ట్రిపుల్ఆర్ పాజిటివ్ టాక్ రావడంతో సినిమా కలెక్షన్లతో దుమ్ములేపుతుంది. దాంతో ట్రిపుల్ఆర్ మూవీ టీం సోమవారం సక్సెస్ పార్టీని జరుపుకుంది. సినిమా సక్సెస్ అయ్యాక నాటు నాటు పాటకు డాన్స్ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి వెల్లడించారు . ఇచ్చిన మాట కోసం డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి రాజమౌళి స్టెప్పులేశారు.
వీడియో చూడాలనుకుంటే కింది లింక్ ఓపెన్ చేయండి..