రాజశేఖర్ ప్రమాదం గురించి మీడియాకి గట్టి వార్నింగ్ ఇచ్చిన జీవిత

రాజశేఖర్ ప్రమాదం గురించి మీడియాకి గట్టి వార్నింగ్ ఇచ్చిన జీవిత

0
99

ఈరోజు ఉదయం హీరో రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు బోల్తా పడటంతో ఆయనకు గాయాలు అయ్యాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై హీరో రాజశేఖర్ ఓ ప్రకటన విడుదల చేశారు.. కారు ప్రమాదంలో తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని హీరో డాక్టర్‌ రాజశేఖర్‌ తెలిపారు. ఇక రాత్రి ప్రయాణంలో తాను ఒక్కడినే ఉన్నాను అని తెలియచేశారు. అయితే దీనిపై అనేక వార్తలు మీడియా వెబ్ సైట్లలో రావడంతో ఆయన భార్య జీవిత ఓ వీడియో విడుదల చేశారు.

నిన్న రాత్రి రాజశేఖర్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైందని , అయితే ఆయన ఎలాంటి డ్రింక్ చేయలేదు అని తెలియచేశారు, కేవలం అన్నీ అసత్య వార్తలు మాత్రమే అన్నారు, ఇక ఆయన ప్రయాణం చేస్తున్న సమయంలో కారు టైర్ పేలి కారు బోల్తా కొట్టింది అని తెలియచేశారు.. ఈ ప్రమాదానికి అదే ప్రధాన కారణం అని తెలిపారు, ఇక పోలీసులు కూడా అక్కడకు చేరుకుని ప్రమాదానికి కారణాలు అడిగారు అని చెప్పారు, రాజశేఖర్ కోలుకున్న తర్వాత ఓసారి ఫార్మాలిటీ ప్రకారం కలవమని చెప్పారని ఆమె తెలియచేశారు, అందరి ప్రేమ ఆప్యాయతలతో రాజశేఖర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు అని ఆమె వీడియో రూపంలో విడుదల చేశారు.