మోదీ అమిత్ షా నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్

మోదీ అమిత్ షా నెక్ట్స్ టార్గెట్ ఫిక్స్

0
51

2014 ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించిన బీజేపీ రెండోసారి కూడా అంతే స్ధాయిలో విజయం సాధించింది, దీంతో రెండోసారి దేశంలో కమల నాధులు తమ అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు, అంతా ప్రధాని నరేంద్రమోదీ అమిత్ షా ఎన్నికల వ్యూహం అనే చెప్పాలి, అలాగే ఐదేళ్ల పరిపాలనలో అవినీతి అక్రమాలు అనేది జరగలేదు ఇవన్నీ ప్రజలకు బాగా దగ్గర అయ్యేలా చేసింది, ప్రభుత్వంపై నమ్మకం కలిగేలా చేసింది.
ఇక బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక అంతా ఫటాఫట్… ధనాధన్ అన్నట్టుగా జరుగుతోంది. రాగానే త్రిపుట్ తలాక్ రద్దు, ఆ వెంటనే కశ్మీర్ లో కీలక నిర్ణయం ఆర్టికల్ 370 రద్దు చేసింది ఇక ఇప్పుడు అయోధ్య వివాదం కూడా కొలిక్కి వచ్చింది.

అయోధ్య తీర్పు బీజేపీ ఎలా అనుకుందో ఖచ్చితంగా అలాగే వచ్చింది. ఇక తదుపరి టార్గెట్ పై ఫోకస్ చేశారు అమిత్ షా నరేంద్రమోదీ అని తెలుస్తోంది.. కమలనాధులు కూడా గట్టి నిర్ణయంతో ఉన్నారు..దేశవ్యాప్తంగా ఉమ్మడి సివిల్ కోడ్ అమలు చేయాలి అని చూస్తున్నారు.. ఇది అత్యంత సవాల్ తో కూడుకుని ఉంది.

కామన్ సివిల్ కోడ్ అంటే అందరికి ఒకే చట్టం అమలు చేయాలి, అన్ని మతాలకు ఇదే చట్టం ఉండాలి.. అందరికి ఒకే హక్కులు ఉంటాయి, ఆస్తులు కాని వ్యక్తిగతంగా వైవాహిక జీవితంలో అందరికి ఒకే హక్కులు ఉండాలి అని ఈ చట్టం చెబుతుంది..కామన్ సివిల్ కోడ్ విషయంలో ఉన్న లొసుగుల నేపథ్యంలో ఏకాభిప్రాయం రావడం కష్టంగానే కనిపిస్తోంది. కాని మోదీ షా ద్వయం దీనిపై ఎలా ముందుకు వెళుతుందో చూడాలి. శీతాకాల సమావేశాల్లో దీనిపై ఓ నిర్ణయం అయితే రానుందట.