సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘అన్నాత్తే’. ఈ మూవీ తెలుగు డబ్బింగ్ రైట్స్ భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈసారి రజనీ కచ్చితంగా సూపర్ హిట్ కొడతాడనే నమ్మకంతో దాదాపు 12 కోట్ల రూపాయలను వెచ్చించినట్లు సమాచారం.
ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, నయనతార, కీర్తి షురేష్ లేడీ రోల్స్‌లో నటిస్తున్నారు. ప్రకాష్ రాజ్, జగపతి బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రానుందీ ఈ సినిమా.