రజనీకాంత్ ‘పెద్దన్న’ మూవీ ఎలా ఉందంటే?

Rajinikanth 'Peddanna' Movie Review

0
113

దీపావ‌ళి సినిమాల్లో ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తిని పెంచిన చిత్ర‌మంటే ర‌జ‌నీకాంత్ ‘పెద్ద‌న్న’ అనే చెప్పుకోవాలి. మాస్ చిత్రాల‌కి పెట్టింది పేరైన ద‌ర్శ‌కుడు శివ తెర‌కెక్కించ‌డంతో ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు నెల‌కొన్నాయి. త‌న అభిమానులైన ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయ‌డానికి ఇష్ట‌ప‌డే ర‌జ‌నీకాంత్‌ని ద‌ర్శ‌కుడు శివ ఎలా చూపించాడు? ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

రాజోలుకు చెందిన వీరన్న(రజనీకాంత్‌)కు చెల్లి కనకమహాలక్ష్మీ అలియాస్‌ కనకమ్‌(కీర్తి సురేశ్‌) అంటే అమితమైన ప్రేమ. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో చెల్లిని గారాబంగా పెంచాడు. చెల్లి సంతోషం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా వెనకాడడు. అంత ప్రేమగా చూసుకునే అన్నయ్య చూసిన పెళ్లి సంబంధం కాదని.. కనకమహాలక్ష్మీ కలకత్తాకు పారిపోతుంది. అసలు కనకమహాలక్ష్మీ అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఎందుకు పారిపోయింది. కలకత్తాలో ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? మరికొద్ది గంటల్లో పెళ్లి ఉండగా పారిపోయిన చెల్లి విషయంలో వీరన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చెల్లికి వచ్చిన సమస్యలను ఎలా తీర్చాడు? చివరకు ఈ అన్నా చెల్లెళ్లు ఎలా కలిశారు అనేదే ‘పెద్దన్న’కథ.

ర‌జ‌నీకాంత్ స్టైల్ మాస్  అంశాల్ని ఆయ‌న హీరోయిజాన్ని జోడించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు ద‌ర్శ‌కుడు శివ‌. ప్ర‌థ‌మార్ధం సినిమా మొత్తం గ్రామీణ నేప‌థ్యంలో సాగుతుంది. ర‌జ‌నీ మార్క్ పంచ్ డైలాగులు, కొన్ని కామెడీ స‌న్నివేశాల‌తో అభిమానుల‌కి న‌చ్చేలాగే  స‌న్నివేశాలు సాగుతాయి. ర‌జనీకాంత్ వ‌న్ మేన్ షో చేశారు.  ఆయ‌న స్టైల్‌, ఆయ‌న మేనరిజమ్స్‌ సినిమాకి ఆక‌ర్ష‌ణ‌గా నిలిచాయి. పాట‌లు, పోరాట ఘట్టాల్ని  హుషారుగా చేశారు. కీర్తిసురేష్ చెల్లెలి పాత్ర‌లో ప‌ర్వాలేద‌నిపిస్తుంది. న‌య‌న‌తార అతిథి పాత్ర‌ని గుర్తు చేస్తుంది. సాంకేతికంగా సినిమా బాగుంది. ఇమ్మాన్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. వెట్రి కెమెరా ప‌నిత‌నం కూడా ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు ఉన్న‌తంగా ఉన్నాయి. ద‌ర్శ‌కుడు శివ కేవ‌లం ర‌జ‌నీపైన, ఆయ‌న స్టార్‌డ‌మ్‌పైన ఆధార‌ప‌డే ఈ క‌థ‌ని అల్లిన‌ట్టు అనిపిస్తుంది.

బ‌లాలు

ర‌జ‌నీకాంత్‌, అక్క‌డ‌క్క‌డా కామెడీ, సంగీతం

బ‌ల‌హీన‌త‌లు

క‌థ.. క‌థ‌నం, ద్వితీయార్ధం

రివ్యూ: 2.5/5