సూపర్ స్టార్ రజనీకాంత్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే రజనీకాంత్ ఇటీవల రాజకీయాల్లోకి వస్తారు అని అందరూ అనుకున్నారు. కాని తాను రాజకీయాల్లోకి రావడం లేదు అని కీలక ప్రకటన చేశారు. ఇక తమిళనాడు ఎన్నికలు ముగిసిపొయాయి. అయితే ఆయన వరుసగా తన సినిమాలు చేసుకుంటున్నారు.
రజనీకాంత్ సడెన్ గా అమెరికా వెళ్లారు. ఇప్పుడు ఇదే అభిమానులు మాట్లాడుకుంటున్నారు. కొంత కాలంగా రజనీకాంత్ ఫారెన్ వెళతారు అనే ప్రచారం జరిగింది. అయితే కోవిడ్ కేసులు ఎక్కువగా ఉండటంతో కాస్త జాగ్రత్త తీసుకుని వెళ్లలేదు. ఈ సమయంలో సడెన్ గా ఆయన అమెరికా వెళ్లారు.
మొన్న జూలై ఎండ్‌లో విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయన హెల్త్ చెకప్ కోసం వెళ్లి ఉంటారు అని భావిస్తున్నారు ఆయన అభిమానులు.హెల్త్ చెకప్ కోసం రెగ్యులర్‌గా ఫారిన్ వెళ్లొస్తుంటారు రజనీకాంత్. 2016 మేలో అమెరికాలో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ చేయించుకున్నారు తలైవా. చూడాలి ఈ టూర్ పై ఏమైనా క్లారిటీ ఇస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.