కొత్త‌గా బ‌య‌ట‌ప‌డిన గ్రీన్ ఫంగ‌స్ కేసు – ఎక్క‌డంటే

Newly exposed green fungus case

0
54
green fungus

దేశంలో కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న కొంద‌రిలో బ్లాక్ ఫంగ‌స్, వైట్ ఫంగ‌స్ ,ఎల్లో ఫంగ‌స్ కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దీనికి కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు వైద్యులు. అయితే ఇలాంటి కొత్త ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే వెంటనే ఆస్ప‌త్రికి వెళ్లాలని ప్ర‌భుత్వం కూడా తెలియ‌చేస్తోంది. తాజాగా మరో ఫంగస్ వెలుగులోకి వచ్చింది. అదే గ్రీన్ ఫంగస్.

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో ఈ ఫంగస్ వెలుగుచూసింది. క‌రోనా నుంచి కోలుకున్న వ్య‌క్తిలో ఈ ఫంగ‌స్ గుర్తించారు. అయితే అత‌న్ని వెంట‌నే ఇండోర్ నుంచి ముంబైకి ఎయిర్ అంబులెన్స్ లో త‌ర‌లించారు. ముందు వైద్యులు ఆయనకు బ్లాక్ ఫంగస్ సోకిందని అనుమానించారు.

త‌ర్వాత అన్నీ ప‌రీక్ష‌లు చేశారు. ఆయన సైనస్, లంగ్స్, బ్లడ్ లో గ్రీన్ ఫంగస్ అభివృద్ధి చెందినట్టు బయటపడింది. దీంతో ఆయ‌న్ని ముంబైలోని హిందుజా ఆసుపత్రికి తరలించామని చెప్పారు. అత‌ను కోవిడ్ నుంచి కోలుకున్నాక కొద్ది రోజుల‌కి ముక్కు నుంచి రక్తం కారడం, జ్వరం తో ఇబ్బంది ప‌డ్డారు ఇక బ‌రువు త‌గ్గిపోయారు. దీంతో ప‌లు టెస్టుల త‌ర్వాత ఆయ‌న‌కు గ్రీన్ ఫంగ‌స్ అని తేలింది, దీనిపై ఇంకా ప‌లు ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి.