తెలుగులో అన్నయ్య టైటిల్ తో రజనీకాంత్

Rajinikanth with the title Annayya in Telugu

0
201

రజనీకాంత్ హీరోగా తమిళంలో అన్నాత్తే సినిమా రూపొందుతోంది. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో హోప్స్ పెట్టుకున్నారు.
శివ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నాడు. ఇమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక ఈ చిత్రం దీపావళికి రానుందని తెలుస్తోంది. అయితే ఇంకా దీనిపై ప్రకటన రావాల్సి ఉంది.

తమిళంలో అన్నాత్తే అంటే అన్నయ్య అనే అర్థం వస్తుంది. మరి తెలుగులో ఏ టైటిల్ పెడతారు అని అందరూ ఆలోచన చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకి తెలుగులో అన్నయ్య అనే పేరుని పరిశీలిస్తున్నారట. రజనీ సినిమాలన్నీ కూడా తమిళంతో పాటే తెలుగులోను విడుదలవుతుంటాయి. ఇక్కడ కూడా ఆయన సినిమాలు సూపర్ హిట్ అవుతాయి.

అయితే అందుకే టైటిల్ విషయంలో కూడా ఆలోచన చేస్తున్నారు మేకర్స్. అన్నీ సెట్ అయితే దీపావళి కానుకగా ఈ సినిమాని అందించాలి అని ప్లాన్ లో ఉన్నారు. ఈ సినిమాలో ఖుష్బూ , మీనా, నయనతార ,కీర్తి సురేశ్, జాకీ ష్రాఫ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్ కీలకమైన పాత్రలను పోషిస్తున్నారు.