రకుల్ సినిమా రీమేక్ లో వెంకటేష్.. హీరోయిన్ గా రకుల్..!!

రకుల్ సినిమా రీమేక్ లో వెంకటేష్.. హీరోయిన్ గా రకుల్..!!

0
96

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ గత కొంతకాలంగా తమిళ మరియు హిందీ భాషలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే రకుల్ ప్రీత్ హిందీలో ‘దే దే ప్యార్ దే’ అనే సినిమాతో హిట్ అందుకుంది.ఇందులో హీరోగా నటించిన అజయ్ దేవగన్ 50 ఏళ్ళు ఉన్న విడాకులు తీసుకున్న పిల్లల తండ్రి పాత్రలో కనిపించగా 25 ఏళ్ల అమ్మాయి గా కనిపించింది రకుల్. వారిద్దరి మధ్య ప్రేమ కథే ఈ సినిమా.దాదాపు 100 కోట్లు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్ కానుందట.

విక్టరీ వెంకటేష్ హీరోగా నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడని సమాచారం. ఈ మేరకు రీమేక్ రైట్స్‌ను ఆయన దక్కించుకున్నట్లు తెలుస్తోంది. 50 ఏళ్ళ హీరో పాత్రలో వెంకటేష్ కనిపించనుండగా.. 25 ఏళ్ళ హీరోయిన్ పాత్ర కోసం మళ్ళీ రకుల్‌నే తీసుకోనున్నారని వినికిడి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుందట. మరి అసలు ఇది నిజమో కాదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే.