కండోమ్ టెస్టర్ గా రకుల్ ప్రీత్ సింగ్..ఏ మూవీలో తెలుసా?

Rakul Preet Singh as a condom tester..do you know in which movie?

0
77

కథానాయిక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ రూటు మార్చింది. గ్లామర్‌ పాత్రల నుంచి వైవిధ్యమైన పాత్రలవైపు ఆమె అడుగులేస్తుంది. తాజాగా ఆమె నటిస్తున్న చిత్రం ‘ఛత్రివాలీ’. ఇందులో ఆమె కండోమ్‌ టెస్టర్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. తేజస్‌ ప్రభ విజయ్‌ డియోస్కర్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో రకుల్ కెమిస్ట్రీ గ్రాడ్యుయేట్‌ అయి ఉద్యోగం కోసం వెతికే ఓ అమ్మాయికి ప్రొఫెషనల్‌ కండోమ్‌ టెస్టర్‌గా ఉద్యోగం వస్తుంది. అయితే బయట ఈ జాబ్ చేస్తున్నాం అంటే ఏమంటారనో, బయట, ఇంట్లో చెప్పకుండా జాబ్ చేసే మహిళగా రకుల్ కనిపించబోతుంది. ఈ క్రమంలో ఆమెకు ఎదురయ్యే సమస్యల్ని వినోదాత్మక కోణంలో చూపిస్తూ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

“నాకు ఎంతో నచ్చి, నమ్మి చేస్తున్న సినిమా ‘ఛత్రివాలీ’. ఈ సినిమా ప్రయాణం చాలా హాయిగా సాగుతుంది” అని ఇన్‌స్టాలో రాసుకొచ్చింది రకుల్‌. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌లో అజయ్‌దేవ్‌గణ్‌తో ‘రన్‌వే 34’, ఆయుష్మాన్‌ ఖురానా ‘డాక్టర్‌ జి’తో పాటు ఇంద్రకుమార్‌ దర్శకత్వంలోనూ ఓ చిత్రంలో నటిస్తోంది రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.