టెస్టు ర్యాంకింగ్స్ విడుదల..వరల్డ్ నం.1 స్థానం అతనిదే..పడిపోయిన కోహ్లీ ర్యాంకింగ్

Test rankings released

0
43

అంతర్జాతీయ క్రికెట్ మండలి తాజా టెస్టు ర్యాంకింగ్స్​ను బుధవారం విడుదల చేసింది. ఆస్ట్రేలియా యువ బ్యాటర్ మార్నస్ లబుషేన్.. వరల్డ్ నం.1 స్థానాన్ని తొలిసారి కైవసం చేసుకుని రికార్డు సృష్టించాడు. టీమ్​ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఏడో స్థానానికి పడిపోయాడు.

యాషెస్​లో అద్భుత ప్రదర్శన చేస్తున్న ఆసీస్ బ్యాటర్ లబుషేన్(912 పాయింట్ల).. జోరూట్​ను(897) వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. చివరగా న్యూజిలాండ్​తో రెండో టెస్టు ఆడిన కోహ్లీ.. ఓ స్థానం దిగజారి ఆరు నుంచి ఏడుకు పడిపోయాడు. రోహిత్ శర్మ.. ఐదో స్థానంలోనే కొనసాగుతున్నాడు. బౌలర్ల విభాగంలో అశ్విన్.. రెండులోనే ఉన్నాడు.

టీ20 బ్యాటర్​ ర్యాంకింగ్స్​లో బాబర్ ఆజామ్ తిరిగి నం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గత వారం వెస్టిండీస్​తో టీ20ల్లో వరుసగా 0,7 స్కోర్లు చేసిన బాబర్.. అగ్రస్థానాన్ని కోల్పోయాడు. మళ్లీ వారంలోనే దానిని తిరిగి దక్కించుకున్నాడు.