ఏకధాటిగా 30 గంటలైనా ఒకే..రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్య..!!

ఏకధాటిగా 30 గంటలైనా ఒకే..రకుల్ ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్య..!!

0
38

చాలా మంది తారలు తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు ఎక్కువగా బాలీవుడ్ పై మక్కువ చూపిస్తూ ఉంటారు. ఇలియానా, చార్మి లాంటి హీరోయిన్లు సైతం తెలుగు నుంచి బాలీవుడ్ కి వెళ్ళినవారే..తాజాగా తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బాలీవుడ్‌లో కాలుపెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పటికే రెండు సినిమాలు తిసిన రకుల్ బాలీవుడ్ లో మెప్పించక పోయినా. ముడోసారి మరో అవకాశాన్ని దక్కించుకుంది. ప్రస్తుతం దే దే ప్యార్ దే సినిమాతో ఈ బ్యూటీ బాలీవుడ్‌లో అడుగుపెడుతుంది. ఈ సినిమా మే 17న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకుల్ మీడియాతో మాట్లాడారు.

సినీ పరిశ్రమలో సక్సెస్, ఫెయిల్యూర్స్ సర్వసాధారణం. యాక్టర్లుగా రాణించాలని లక్షలాది మంది కలలు కంటారు. ఎవరికో ఒకరికి మాత్రమే అలాంటి అదృష్టం దక్కుతుంది. సినీ పరిశ్రమలో నాకు దక్కిన స్థానం చూసుకొని గొప్పగా ఫీల్ అవుతాను. భగవంతుడి కృపను నేను నమ్ముతాను. కష్టపడి పనిచేయడం అంటే నాకు చాలా ఇష్టం. పనిని నేను ఆస్వాదిస్తాను. వర్క్‌ను నేను ఎంతగా ఇష్టపడుతానంటే.. 30 గంటలపాటు అలుపుసొలుపు లేకుండా ఏకధాటిగా పనిచేయగలను. ప్రతిభావంతులతో పనిచేయాలని ఎప్పుడూ కోరుకొంటాను. నాలో ప్రతిభను గుర్తించే వారి కోసం ఎప్పుడూ ఎదురుచూస్తుంటాను అని రకుల్ అన్నారు.