మెగా అభిమానులకు అపోలో ఆసుపత్రి వర్గాలు శుభవార్త తెలిపాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), ఉపాసన(Upasana Konidela) దంపతులకు పండంటి ఆడబిడ్డ జన్మించినట్టు అధికారిక ప్రకటన విడుదల చేశాయి. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్టు హెల్త్ బులిటెన్ లో వైద్యులు పేర్కొన్నారు. కాగా, సోమవారం రాత్రి ఉపాసనకు డెలివరీ పెయిన్స్ రావడంతో కుటుంబ సభ్యులు ఆమెను జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యేక్షణలో ఉన్న ఆమె మంగళవారం తెల్లవారుజామున ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు సమాచారం. అయితే ఆమెకు నార్మల్ డెలివరీ అయిందా లేక సీ సెక్షన్ ద్వారా డెలివరీ అయిందా అనేది తెలియాల్సి ఉంది. రామ్ చరణ్ ఉపాసన దంపతులకు పెళ్ళైన 11 ఏళ్ల తర్వాత మొదటి సంతానం కలగడంతో అటు కామినేని, ఇటు కొణిదెల కుటుంబాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి.
మరోవైపు రామ్ చరణ్ కు ఆడబిడ్డ పుట్టింది అని తెలియగానే పెద్ద ఎత్తున మెగా అభిమానులు జూబ్లీహిల్స్ లోని అపోలో ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. మెగా ప్రిన్సెస్ వచ్చేసిందంటూ ఆసుపత్రి చుట్టుపక్కల ఫ్లెక్సీలు కట్టి, టపాసులు పేల్చుతూ సంబురాలు నిర్వహిస్తున్నారు. దీంతో అపోలో ఆసుపత్రి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాన్స్ కోసం అపోలో ఆసుపత్రి సిబ్బంది అక్కడ ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చిరంజీవి సురేఖ దంపతులు మెగా కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. ఉపాసన(Upasana Konidela) మెగా వారసురాలికి జన్మనివ్వడంతో కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంది. సన్నిహితులు, కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యామిలీకి శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.
రాంచరణ్ కు జపాన్ అభిమానుల స్పెషల్ విషెస్
గ్లోబర్ స్టార్ రాంచరణ్ దంపతులకు విదేశాల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. మెగా వారసురాలికి ఉపాసన జన్మనివ్వడంతో జపాన్ అభిమానులు కంగ్రాట్స్ చెబుతూ విష్ చేస్తున్నారు. మెగా ప్రిన్సెస్ వచ్చిందంటూ ట్వీట్లు చేస్తున్నారు. రాంచరణ్ కు జపాన్ లో పెద్ద ఎత్తున అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. అక్కడ ఆయన సినిమాలు విపరీతమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. కాగా, జపాన్ తనకు స్పెషల్ అంటూ గతంలో చెర్రీ ట్వీట్ చేశారు.
Read Also:
1. బేబీ పుట్టాక మావయ్య వాళ్లతో కలిసి ఉంటాం: ఉపాసన
Follow us on: Google News, Koo, Twitter, ShareChat