Ram Charan | తల్లికి వంటలో సాయం చేసిన చరణ్.. ఏం వండాడో తెలుసా..?

-

మహిళా దినోత్సవం సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan) తన తల్లి సురేఖకు వంటలో సాయం చేస్తూ కనిపించాడు. దీనిని ఆయన భార్య ఉపాసన వీడియో తీసింది. ఈ వీడియోలో ఉపాసన “అత్తమ్మ గారండీ ఈ రోజు మీ కిచెన్‌లో ఏం అవుతుంది అంటే.. సురేఖ.. ఏమవుతుంది, దోశ అవుతుంది.. నా కొడుకు నా కోసం వండుతున్నాడు. ఉమెన్స్ డే అని ఇవాళ తనే మనకు వండుతున్నాడు అని చెప్పింది. దీంతో ఉపాసన.. రోజూ ఉమెన్స్ డే ఉంటే బాగుండు అంటుంది.. ఇక చరణ్ వంట చేస్తుంటే ఏం వండుతున్నావు అని అడగ్గా.. దోశ, పన్నీర్ టిక్కా మా అమ్మ కోసం” అని చెప్పాడు. ఈ వీడియోను ఉపాసన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది.

- Advertisement -

అపర కుబేరుడు ముఖేశ్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్‌ల ప్రివెడ్డింగ్ వేడుకకు చెర్రీ, ఉపాసన దంపతులు ఓ ప్రైవేట్ జెట్‌లో వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో ఉపాసన నిద్రపోతుంటే ఆమె పాదాలకు చెర్రీ మసాజ్ చేస్తూ ఉన్నాడు. దీనిని చరణ్‌ అసిస్టెంట్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది.

వీడియో చూసిన అభిమానులు తమదైన శైలిలో స్పందించారు. ఎంతటి వారైనా సరే భార్యకు సేవలు చేయాల్సిందేనని.. చెర్రీ ఆదర్శ భర్త అని, ఉత్తమ భర్త అవార్డు ఇచ్చేయాలని కామెంట్లు చేశారు. తమకు ఇలాంటి భర్త రావాలని లేడి ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. గతంలోనూ RRR ప్రమోషన్స్ కోసం అమెరికా వెళ్ళినప్పుడు ఉపాసన షాపింగ్ బ్యాగులు చెర్రీ(Ram Charan) మోశాడు. అలాగే ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా సాయం చేస్తూ ఉంటాడు. దీంతో వీరిని టాలీవుడ్ బెస్ట్ కపుల్ అంటూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...