బ్రేకింగ్ రామ్ చరణ్ కు గాయాలు

బ్రేకింగ్ రామ్ చరణ్ కు గాయాలు

0
93

ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.. ఈ సమయంలో ఆర్ ఆర్ ఆర్ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ వస్తుందా అనే ఆలోచన కూడా పెరుగుతోంది, ఇక రాజమౌళి కూడా ఇందులో మరో వండర్ చూపిస్తారా అనే ఆసక్తి అందరికి ఉంది. మరి రాజమౌళి చేసే మ్యాజిక్ ఏమిటో చూడాలి. అయితే ఈసినిమాలో తారక్ చెర్రీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు …ఇక ఈ మల్టీస్టారర్ సినిమా షూటింగ్ ప్రస్తుతం గుజరాత్ లోని వడోదరాలో జరుగుతోంది.

ఈ సమయంలో చెర్రీ అభిమానులకు ఓ షాకింగ్ వార్త వచ్చింది …చెర్రీ జిమ్ లో కసరత్తలు చేస్తుండగా మడిమ భాగంలో గాయం కావడంతో షూటింగ్ను వాయిదా వేశారు. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ బృందం తమ ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. దీంతో చరణ్ కు ఏమైందా అనే టెన్షన్ అందరికి పెరిగిపోయింది, ఆయనకు గాయం అయింది ఈ కారణంతో ఫూణె షెడ్యూల్ రద్దు చేస్తున్నాము అని 20 రోజుల తర్వాత షూటింగ్ మళ్లీ మొదలు పెడతాము అని తెలియచేశారు చిత్ర బృందం.