ట్రెండింగ్ లో జగన్ గూగుల్ ర్యాంకు లో నెంబర్ 1

ట్రెండింగ్ లో జగన్ గూగుల్ ర్యాంకు లో నెంబర్ 1

0
61

ఎన్నికల వేళ రాజకీయంగా ఏపీలో చర్చ జరుగుతోంది.. ఎవరికి ప్రజా బలం ఉంది అనేది మరో వారంలో తేలిపోతుంది.. ఈలోపు ట్రెండింగ్ కూడా సోషల్ మీడియాలో సెట్ చేస్తున్నారు ..ఒకరా ఇద్దరా కోట్లాది మంది జనబలం సంపాదించుకుంటున్నారు నాయకులు ..ముఖ్యంగా వైయస్ జగన్ చంద్రబాబు మధ్యే ఇప్పుడు రాజకీయంగా చర్చ జరుగుతోంది.. ఇద్దరిలో ఎవరు సీఎం అవుతారు అనేది పెద్ద ప్రశ్న, స్టేట్ అంతా ఇదే విషయం మార్మోగిపోతోంది. జగన్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు . ఎక్కడ చూసినా సభలకు పెద్ద ఎత్తున జనం వస్తున్నారు.. జగన్ సభలకు ఇసుకవేస్తే రాలనంత జనంతో రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోతున్నాయి ..మరో పక్క తమ్ముళ్లు తమ్ముళ్లు అంటూ కేసీఆర్ ఓడిపోవాలి అంటే తనకు ఓటు వేయండి అని చెబుతున్నారు బాబు .ఈ పాత ప్రసంగాలు జనాలకు కాస్త బోర్ కొట్టిస్తున్నాయి.

ఈ క్రమంలో సోషల్ మీడియా ప్లాట్ఫాంలలో వైఎస్ జగన్ గురించిన చర్చ తరచుగా జరుగుతోంది. ఆయన గురించి సెర్చ్ ఇంజన్ దిగ్గజం గూగుల్లో వెదికే వారి సం‍ఖ్య పెరుగుతోంది. గత 30 రోజులుగా గూగుల్ ట్రెండింగ్స్ను ఒకసారి పరిశీలించినట్లైతే వైఎస్ జగన్ గ్రాఫ్ గణనీయంగా పెరిగినట్లు స్పష్టమవుతోంది… వెబ్ సైట్ యూట్యూబ్ ఎక్కడ చూసినా వైయస్ జగన్ కు పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది. ఇప్పుడు ఇదే ట్రెండ్ టాపిక్ సోషల్ మీడియాలో కూడా అయింది.