చంద్రబాబు భార్య మాటతో టీడీపీలో కొత్త హుషారు

చంద్రబాబు భార్య మాటతో టీడీపీలో కొత్త హుషారు

0
49

ఆమె సీఎం చంద్రబాబు సతీమణీ, రాజకీయాలు అసలు పట్టించుకోరు, కాని ఆమె ప్రజలకు తన భర్త చేస్తున్న సేవ చూసి, ఎప్పుడూ ఆనందిస్తారు. తన భర్త 40 ఏళ్లుగా ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్నారు అని ఆమె ఆనందం తెలియచేస్తారు.. రాష్ట్రానికి మూడు సార్లు సీఎంగా చేసిన ఘనత ఆయన సొంతం….ఇక ఏపీకి తొలిసీఎంగా అమరావతి నిర్మాతగా ఆయన పేరు గడించారు. ఇక తొలిఇటుక వేసింది కూడా ముఖ్యమంత్రిగా ఆయనే, అయితే ఆమె కూడా భర్తకు సాయంగా రాజకీయాల్లో తన వంతు కృషి చేస్తున్నారు.. 174 నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన చేస్తుంటే ఆయన భార్య భువనేశ్వరి భర్త నిలబడే కుప్పం నియోజకర్గంలో ప్రచారం చేస్తున్నారు.. తెలుగుదేశం నేతలకు హుషారు తెప్పిస్తున్నారు.

టీడీపీ కుప్పం నాయకులతో టెలీకాన్ఫరెన్స్ అలాగే అక్కడ ప్రచారం వారి సమస్యలపై ఓ రిపోర్టు ఇలా అనేక పనులు చూస్తున్నారు ..ప్రచారంలో కూడా ఇంటింటికి ఆమె నడిచి తిరుగుతున్నారు.. రోడ్ షోలుకాకుండా నేరుగా వారి దగ్గరకు వెళ్లి సమస్యలు చెబుతున్నారు… మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా నాకు చెప్పండి అని స్వయంగా సీఎం భార్య అడగడంతో అక్కడ వారు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇక ఆమె నాయకులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబుకు లక్షా 20వేలు ఓట్లు ఆధిక్యం వచ్చేలా కష్టపడాలన్నారు. ఈగోను పక్కనపెట్టి కార్యకర్తలు, నేతలంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. 2014లో 63 శాతం ఓట్లతో ఫస్ట్ క్లాసులో పాస్ చేశారంటున్నారు భువనేశ్వరి. ఈసారి 75 శాతం ఓట్లతో డిస్టింక్షన్లో పాస్ చేయాలన్నారు. 1.20 లక్షల ఓట్ల మెజారిటీ సాధించాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఇక భార్య భువనేశ్వరి కుప్పం రాజకీయ బాధ్యతలు ఎన్నికల ప్రచారం చూసుకోవడంతో ఆయన చాలా సంతోషంగా ఉన్నారట.