రామ్ గోపాల్ వర్మకి షాకిచ్చిన దిశ నిందితుల కుటుంబాలు

రామ్ గోపాల్ వర్మకి షాకిచ్చిన దిశ నిందితుల కుటుంబాలు

0
90

దిశ ఘటన ఎవరూ మర్చిపోలేనిది, ఇలాంటి దారుణాలు మరెక్కడా జరగకూడదు అని యావత్ దేశం కోరుకుంది, అయితే ఈ ఘటనపై చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు దర్శకుడు వర్మ, ఇప్పటికే కుటుంబ సభ్యులు ఈ సినిమాపై అభ్యంతంరం తెలిపారు, అయితే తాజాగా దిశ చిత్రానికి మరో సమస్య ఎదురైంది.

దిశ హత్యాచార నిందితుల కుటుంబాలు కూడా ఈ చిత్రం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తమ కొడుకులను ఇందులో విలన్లుగా చూపుతున్నారని, ఈ చిత్రాలు అడ్డుకోవాలని సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. ఈ నాలుగు కుటుంబాలు హైకోర్టులోని ఫిర్యాదు అందచేశాయి.

ఈ కేసులో నిందితులు జొళ్లు శివ , జొళ్లు నవీన్ , చెన్నకేశవులు , ఆరీఫ్లను పోలీసులు ఎన్కౌంటర్ చెశారు.. అయితే ఈ సినిమాలో వర్మ నిందితులని క్రూరంగా చూపిస్తున్నారు, దీని వల్ల సమాజంలో మాకు జీవించే స్వేచ్చ ఉండదు అని తెలిపాయి. అంతేకాదు ఈ కుటుంబాల్లో పిల్లలపైనా ఈ చిత్రం తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపారు.