సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘రణరంగం’ ఈ నెల 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డువారు U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.
ఈ సినిమాలో శర్వానంద్ యువకుడిగా రఫ్ లుక్ తోను .. మధ్య వయసు మాఫియా డాన్ గా డీసెంట్ లుక్ తోను కనిపించనున్నాడు. ఆయన సరసన కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ నటించారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం శర్వానంద్ ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమాతో తనకి తప్పకుండా హిట్ పడుతుందనే నమ్మకంతో ఆయన వున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి మరి