సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పించిన ప్రముఖ సైకత శిల్పి

సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పించిన ప్రముఖ సైకత శిల్పి

0
38

ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ బిజెపి సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌కు నివాళులర్పించారు. పూరీ తీరంలో సుష్మా చేసిన చివరి ట్వీట్‌ కూడిన సైకత శిల్పాన్ని తీర్చిదిద్ది.. ఆమెకు నివాళులర్పించారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి హోదా రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించటంపై ప్రధాని మోదీని అభినందిస్తూ సుష్మా మంగళవారం ట్వీట్‌ చేశారు.ఈ ట్వీట్‌ చేసిన కొద్దిసేపటికే ఆమె గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా నిన్న ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు.