మనసులో మాట చెప్పిన రాశీఖన్నా

మనసులో మాట చెప్పిన రాశీఖన్నా

0
79

చాలా మంది డాక్టర్ అవ్వాలి అని అనుకుని యాక్టర్ అయ్యాను అంటారు, ఇలాంటివి చాలా మంది చెబితే వింటాం,. అయితే తాజాగాఓ హీరోయిన్ మాత్రం తాను ఇలా చెప్పను అంటోంది…అనుకోకుండా వచ్చినా ఈ జీవితం చాలా సంతృప్తిగా ఉంది. దేవుడు నా అర్హతకు మించి అన్నీ ఇచ్చాడు. అంటోంది ఈ అందాల భామ రాశీఖన్నా..

పలు భాషల్లో సినిమాలు చేశాను కోట్లాదిమంది అభిమానులు వచ్చారు, ఇలాంటి అదృష్టం అందరికి రాదు అని ఆమె తన మనసులో మాట చెప్పింది.

సినిమా పరిశ్రమ నాకు ఎంతో ఇచ్చింది. జీవితం ఎలా సాగించాలో నేర్పించింది. అందుకే నేను చాలా సింపుల్గా ఉంటా. సక్సెస్ వస్తే కళ్లు నెత్తిన పెట్టుకోను. డౌన్ టు ఎర్త్ ఉంటా. అదే నేనీ స్థాయిలో ఉండటానికి కారణం అనుకుంటా అని చెప్పింది , వెంకీ మామ, ప్రతీరోజు పండగే రెండు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం రాశీఖన్నా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది.. మరొ రెండు చిత్రాలు ఆల్రెడీ డిస్కషన్స్ లో ఉన్నాయట.