కాపులకు గుర్తుండిపోయే ఆఫర్ ను ప్రకటించిన జగన్…

కాపులకు గుర్తుండిపోయే ఆఫర్ ను ప్రకటించిన జగన్...

0
44

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు… తాజాగా జగన్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు…

కాపునేస్తం పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతీ కాపు మహిళకు ఐదేళ్లలో 75 వేలు అందజేతకు ఆమోదం తెలిపారు… అలాగే టీటీడీ పాలక మండలి సభ్యుల పెంపు దానితో పాటు కొత్త రేషన్ కార్డులు వైఎస్సార్ నవశకంతో పాటు మరికొన్ని నిర్ణయాలను తీసుకున్నారు… కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలు ఈ క్రింది విధంగా ఉన్నారు…

టీటీడీ పాలకమండలి సభ్యుల సంఖ్య 19 నుంచి 29కి పెంపు
వైఎస్సార్‌ కాపు నేస్తం పథకం కింద కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళలకు ఏడాదికి రూ.15వేలు ఆర్థిక సాయం ఈ పథకానికి రూ.1101కోట్లు కేటాయింపు
నవశకం సర్వే ద్వారా వివిధ ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయాలని కేబినెట్ నిర్ణయించింది.
10 ఎకరాల మాగాణి, 25 ఎకరాల మెట్ట భూమి, 2.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారికి వసతి దీవెన పథకం వర్తిస్తుందని వివరించారు.
కాపు నేస్తం పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి కాపు మహిళకు ఐదేళ్లలో రూ.75వేలు అందజేతకు ఆమోదం తెలిపారు.
కడప ఉక్కు పరిశ్రమకు ముడిసరుకు కోసం ఎన్‌ఎండీసీతో ఒప్పందాని ఆమోదం.
జగనన్న వసతి దీవెన కింద రూ.2300కోట్లు, జగనన్న విద్యా దీవెన కింద రూ.3400కోట్లు కేటాయింపు.