రష్మిక మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్

రష్మిక మరో భారీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్

0
97

టాలీవుడ్ లో ఇప్పుడు అగ్రహీరోయిన్లుగా పూజా-రష్మిక హవా నడుస్తోంది, భారీ చిత్రాలు అన్నీ వారిద్దరి నుంచి సెట్స్ పైకి వెళుతున్నాయి, చేతి నిండా ఫుల్ గా సినిమాలు ఉన్నాయి ఇద్దరికి, ఇక తాజాగా రష్మికకు అయితే ఫుల్ సినిమాలతో కాల్షీట్లు ఫుల్ అయ్యాయి.

సరిలేరు నీకెవ్వరుసినిమాలో రష్మిక చేసిన నటన అందరికి నచ్చింది, ఇక కన్నడ భామ భీష్మతో రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న పుష్ప`లో నటిస్తోంది. ఈ సమయంలో ఆమెకి కోలీవుడ్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి.

అక్కడ తమిళ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించే చిత్రంలో రష్మిక నటించబోతోంది. నిజానికి విజయ్ మాస్టర్ చిత్రంలోనే రష్మిక నటిస్తోందంటూ వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కుదరలేదు.
తాజాగా విజయ్ చిత్రంలో ఆమెకి ఛాన్స్ వచ్చిందట.. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రాన్ని
రూపొందిస్తున్నారు.