సోషల్ మీడియాలో డెలివరీ బాయ్ వీడియో వైరల్ ఏం చేశాడంటే

సోషల్ మీడియాలో డెలివరీ బాయ్ వీడియో వైరల్ ఏం చేశాడంటే

0
85

ఒక్కోసారి కొన్ని ఘటనలు కన్నీళ్లు తెప్పిస్తాయి, అసలే బాధల్లో ఉంటే మరింత బాధ వారికి వస్తే కోలుకోవడం కష్టం, ముఖ్యంగా దోపిడిలు జరిగిన సమయంలో ఇది మరింత చర్చకు వస్తుంది, చాలా మంది రోడ్ల మీద దోపిడీకి గురవుతుంటారు. అలా ఓ డెలివరీ బాయ్ రోడ్డుపైనే చోరికి గురయ్యారు.

పాపం చేసేది అతను చిన్న ఉద్యోగం తన కుటుంబాన్నీ దానితోనే పోషించుకోవాలి, అలాంటి డెలివరీ బాయ్ దగ్గర దోపిడికి ప్రయత్నించారు ఇద్దరు ,డెలివరీ ఇచ్చి వెళ్లే సమయంలో అటుగా వచ్చిన ఓ ఇద్దరు దుండగులు.. బెదిరించి, అతడి దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులను లాక్కున్నారు.

దీంతో వెంటనే ఆ డెలివరీ బాయ్ ఏడ్చేశాడు. అయితే అతడి ఏడుపుతో మనసు మార్చుకున్న ఆ ఇద్దరు దొంగలు అతడి వస్తువులను తిరిగి ఇచ్చేశారు. వెంటనే అక్కడ ఓ దుండగుడు అతనిని హత్తుకున్నాడు, ఈ సమయంలో అతనిని ఓదార్చి దొంగతనం చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయాడు. పాకిస్థాన్ రాజధాని కరాచీలో ఈ సంఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.