చిన్న తప్పుతో రష్మికకు భారీ షాక్

చిన్న తప్పుతో రష్మికకు భారీ షాక్

0
99

సినిమా అంటేనే రంగుల ప్రపంచం …ఫేమ్ కోసం ఎన్నోచేస్తారు. అయితే ఇటీవల లిప్ లాప్ కిస్ లు కాస్త మసాలా జోడించే డైలాగులు ఎక్స్ పోజింగ్ పాళ్లు పెరిగిపోతున్నాయి. వీటిని తగ్గిస్తే సినిమా వసూళ్లు తగ్గిపోతున్నాయి. అయితే మంచి హిట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్న రష్మిక, విజయ్ దేవరకొండ తాజాగా నటిస్తున్న చిత్రం డియర్ కామ్రేడ్.. ఈసినిమా మంచి ఆదరణ పొందుతుంది అని టాక్… దీనికి కారణం వీరి పెయిర్ , ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గీతగోవిందంతో సూట్ అయింది అని చెబుతారు. ఇక డియర్ కామ్రేడ్ సినిమా టీజర్ ఇటీవల రిలీజైంది. దీనిపై మిశ్రమ స్పందన అభిమానుల నుంచి వస్తోంది. దీనికి కారణం ఈటీజర్ లో లిప్ లాక్ సీన్ చూపించడం.

ఒక అభిమాని. రియల్లీ సారీ.. నీ లిప్లాక్ కారణంగా నువ్వుంటే నాకు అసహ్యమేస్తోంది. నువ్వంటే ఉన్న అభిమానం పోయింది అని ఆమెని తిడుతూ పోస్ట్ పెడితే కోట్ల రూపాయల కోసం ఇంత దారుణంగా నటిస్తావా అని మరొకరు. ఇక మరొకరు అయితే తన పాత బాయ్ ఫ్రెండ్ రక్షిత్ ని జోడించి రిప్ రక్షిత్ శెట్టి అని ట్వీట్.. మొత్తం ఇలా అందరూ ఈ లిప్ లాక్ సీన్ వల్ల నెగిటీవ్ ట్రోల్ చేస్తున్నారు. దీంతో రష్మిక షాక్ అయిందట. మరి సినిమాలో ఈ సీన్ ఉంచుతారో లేదోఅనే డౌట్ ఇప్పుడు వస్తోంది.