బాలీవుడ్ కి నో చెప్పిన ర‌ష్మిక మంద‌న్నా

బాలీవుడ్ కి నో చెప్పిన ర‌ష్మిక మంద‌న్నా

0
92

ఛ‌లో మూవీతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ ర‌ష్మిక మంద‌న్నా. ఈ హీరోయిన్ ఛలో రీసెంట్‌గా రిలీజైన `గీత గోవిందం` సినిమాల స‌క్సెస్ త‌ర్వాత తెలుగులో బిజీగా మారింది. ఈమె న‌టించిన `దేవ‌దాస్‌` విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. కాగా గీత గోవిందం త‌ర్వాత‌ విజ‌య్‌దేవ‌ర‌కొండ‌తో `డియ‌ర్ కామ్రేడ్‌`, చిత్రంలో కూడా న‌టిస్తుంది.

రీసెంట్‌గా ర‌ష్మిక న‌టించిన ఓ క‌న్న‌డ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా త‌న‌కు బాలీవుడ్ నుండి సినిమా అవ‌కాశాలు వ‌చ్చాయ‌ని.. అయితే ఒప్పుకోలేద‌ని చెప్పింది. మంచి స్క్రిప్ట్ అనిపిస్తేనే బాలీవుడ్‌లో న‌టిస్తాన‌ని చెప్పింది ర‌ష్మిక‌.