రవితేజ క్రాక్ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది

రవితేజ క్రాక్ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చేసింది

0
93

దాదాపు మార్చి నెల చివరి నుంచి సినిమాలు విడుదల ఆగిపోయాయి, ధియేటర్లు ఓపెన్ అవడం లేదు.. ఇక కొన్ని సినిమాలు ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి, అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న సినిమాలకు ఇప్పుడు అనేక ఇబ్బందులు.. దాదాపు నాలుగు నెలల నుంచి తమ సినిమాలు ఆగిపోయాయి అని డైలమాలో ఉన్నారు నిర్మాతలు.

అందుకే విడుదలకి సిద్దంగా ఉన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు పలువురు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. కీర్తి సురేష్ పెంగ్విన్ ఓటీటీలో రిలీజ్ అయింది, మరికొన్ని చిత్రాలు విడుదల అయ్యాయి. ఇప్పుడు అదే బాటలో రవితేజ సినిమా కూడా ఓటీలో విడుదలకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపించాయి.

అయితే గోపిచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్లో వస్తున్న ఈ క్రాక్ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సమయంలో క్రాక్ ఓటీటీలో విడుదల అవుతుంది అని వార్తలు వచ్చాయి, అయితే ఇందులో వాస్తవం లేదట..క్రాక్ సినిమా థియేటర్లలోనే విడుదలవుతుందని స్పష్టం చేసారు చిత్రయూనిట్ ..ఈసినిమాలో రవితేజకు జంటగా శృతిహాసన్ నటిస్తుంది.