తగ్గేదేలే..పాన్ఇండియా సినిమాకు రవితేజ గ్రీన్​సిగ్నల్!

Ravi Teja gives green signal to PanIndia movie

0
91

మాస్​మహారాజా రవితేజ కెరీర్​ విషయంలో జోరు పెంచారు. వరుస సినిమాలను ఓకే చేస్తున్న ఆయన.. తాజాగా పాన్ఇండియా సినిమాకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చారు. ఇప్పుడా సినిమా వివరాలను ప్రకటించారు. గజదొంగ ‘టైగర్​ నాగేశ్వరరావు’ బయోపిక్​గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.

తాజాగా దీనికి సంబంధించిన పోస్టర్​ విడుదలవగా.. అది ఆసక్తిని రేపుతోంది. ‘వేట​ ప్రారంభమయ్యే ముందు ఉండే నిశ్శబ్దాన్ని ఆస్వాదించండి’ అని క్యాప్షన్ ఇచ్చారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో రూపొందనున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్​ అగర్వాల్​ ఆర్ట్స్​ నిర్మిస్తోంది.

రవితేజ.. ఈ ఏడాది ప్రారంభంలో ‘క్రాక్’​ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయాన్ని అందుకున్నారు. ఆ తర్వాత వరుస ప్రాజెక్ట్​లను ఒకే చేస్తూ షూటింగ్స్​లో బిజీ అయ్యారు. ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్​ డ్యూటీ’, ‘ధమాకా’, దర్శకుడు సుధీర్​ వర్మతో ఓ చిత్రం చేస్తున్నారు.