నోరు శుభ్రంగా ఉంచుకోవట్లేదా?..అయితే తస్మాత్ జాగ్రత్త

Shouldn't the mouth be kept clean? .. But Tasmat be careful

0
39

నోరు శుభ్రంగా ఉంటే శరీరంలోని సగం వ్యాధుల నుంచి మనల్ని మనం రక్షించుకున్నట్లే అంటున్నారు వైద్య నిపుణులు. అవును నోరు ఆరోగ్యంగా ఉంటే గుండెజబ్బులు, ఛాతీ ఇన్ఫెక్షన్లను దరి చేరవు. దంతాల ఇన్ఫెక్షన్లు గుండె జబ్బుల ప్రమాదాన్ని దాదాపు మూడు రెట్లు పెంచుతాయి. దంత ఇన్‌ఫెక్షన్‌లకు చికిత్స పొందిన రోగుల కంటే, చికిత్స చేయని దంతాల ఇన్‌ఫెక్షన్‌లు ఉన్న వ్యక్తులకు హృదయ సంబంధ సమస్యలు వచ్చే అవకాశం 2.7 రెట్లు ఎక్కువగా ఉందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది.

ప్రపంచవ్యాప్తంగా సంభవించే మరణాలలో 30 శాతం మంది హృదయ సంబంధ వ్యాధుల కారణంగానే ఓ పరిశోధనలో వెల్లడైంది. అందుకనే రోగనిరోధక శక్తి బలహీనం కాకుండా నోరుని శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తున్నారు. పరిశుభ్రమైన నోటిలో ఉండే సూక్ష్మక్రిములే ప్రత్యక్షంగా గుండెజబ్బులతో పాటు పరోక్షంగా డయాబెటిస్, ఆస్టియోపోరోసిస్, అనేక శ్వాసకోశ వ్యాధులతో పాటు అరుదుగా కొన్ని క్యాన్సర్లకూ కారణమవుతాయి. కనుకనే ఎప్పటికప్పుడు నోటిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు..అవసరమైతే వైద్యులను కూడా సంప్రదించాల్సి ఉంది.

కనుక అనేక వ్యాధులను నివారించుకోవడం కోసం నోటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చిగుర్ల సమస్యలు ఏర్పడకుండా చూసుకోవాలి. చిన్న సమస్య ఏర్పడినప్పుడే.. నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను వెంటనే సంప్రదించాలి. అలాగే మీ నోటి ఆరోగ్యాన్ని చూసుకోవడంతో పాటు చిగుళ్ల వ్యాధిని నివారించడం కోసం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండడం మంచిది.