టీమ్​ఇండియా కొత్త కోచ్ గా రాహుల్ ద్రవిడ్

Rahul Dravid is the new coach of Team India

0
39

టీమ్​ఇండియా కొత్త కోచ్ రాహుల్ ద్రవిడ్​ ఎంపికయ్యాడు. భారత క్రికెట్ సలహా మండలి.. అతడిని కోచ్​గా బీసీసీఐ ప్రతిపాదనకు పంపింది. దీంతో ద్రవిడ్​ కోచ్​గా నియమిస్తూ బీసీసీఐ, బుధవారం అధికారికంగా ప్రకటన చేసింది. భారత్ అండర్-19, ఏ జట్లకు కోచ్​గా పని చేసిన ఆయన.. టీమ్​ఇండియా పురుషుల జట్టుకు హెడ్​ కోచ్​గా చేయనుండటం అభిమానుల్లో ఆనందం కలిగిస్తోంది.

బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి హెడ్​గా ఉన్న ద్రవిడ్.. ఇప్పుడు టీమ్​ఇండియా ఆటగాళ్లకు మార్గనిర్దేశనం చేయనున్నారు. న్యూజిలాండ్​ టీ20 సిరీస్​తో బాధ్యతలు అందుకోనున్న ద్రవిడ్.. రెండేళ్ల పాటు హెడ్​ కోచ్​గా ఉండనున్నారు.

1996-2012 మధ్య టీమ్​ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన ద్రవిడ్.. మొత్తంగా 164 టెస్టులు, 344 వన్డేలు, ఓ టీ20 ఆడాడు. 48 సెంచరీలు అతడి ఖాతాలో ఉన్నాయి.