పవర్​స్టార్​ హీరోగా ‘రిపబ్లిక్’ సీక్వెల్..స్పష్టం చేసిన డైరెక్టర్

'Republic' sequel as Power Star hero..Directed director

0
119

నిజాయితీగా పని చేసే అభిరామ్ అనే ఓ ఐఏఎస్ అధికారి కథతో ప్రముఖ దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన చిత్రం ‘రిపబ్లిక్’. సాయి ధరమ్ తేజ్, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్ లోనే కాకుండా ఓటీటీలోనూ విశేష ప్రేక్షకాదరణ పొందింది.

ఇప్పుడు ఈ చిత్రానికి రెండో భాగాన్ని పవన్ కల్యాణ్ కథానాయకుడిగా తెరకెక్కించాలని దర్శకుడు దేవకట్టా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు. రాజకీయ, పోలీసు, న్యాయ వ్యవస్థలో ఏదో ఒక అంశంపై రిపబ్లిక్ రెండో భాగం ఉంటుందని దేవకట్టా స్పష్టం చేశారు. రిపబ్లిక్​తో పాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన వస్తుండటం వల్ల హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్​లో జీ5 ఓటీటీ సంస్థ విజయోత్సవ వేడుకలకు నిర్వహించింది.

దర్శకుడు దేవకట్టాతోపాటు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ నిర్మాత నిహారిక హాజరై కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని పంచున్నారు. ఈ సందర్భంగా రిపబ్లిక్ రెండో భాగంపై స్పష్టత ఇచ్చారు దేవకట్టా. మరో రెండు నెలల్లో రిపబ్లిక్ చిత్రానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించనున్నట్లు తెలిపారు.