ఆర్జీవీ మరో సంచలన సినిమా అనౌన్స్..ఈసారి..

0
111
RGV

ఆర్జీవీ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తుంటారు. ఆయన తీసే సినిమాలు కూడా అందుకు మినహాయింపు కాదు. రీసెంట్ గా ‘కొండా’ మూవీతో రామ్ గోపాల్ వర్మ వచ్చాడు. ఇందులో తెలంగాణలోని వరంగల్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ లీడర్ కొండా సురేఖ మురళీధర్ రావు, సురేఖ జీవిత చరిత్రను చూపించారు.

ఇక తాజాగా ఆర్జీవీ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. ఈసారి కొవిడ్ మరణాలపైన సినిమా తీస్తున్నారు.  భయానకమైన కొవిడ్ సెకండ్ వేవ్ వెనుక ఉన్నది కరోనా వైరస్ కాదని, అధికార యంత్రాంగ నిర్లక్ష్యమని వర్మ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్స్ చేశారు. రాజకీయ నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందని, ఇందులో చూపించే వాస్తవాలు ఓటర్లలో ఆగ్రహం తెప్పిస్తాయని పేర్కొన్నారు. ఈ సినిమాకు  ‘కొవిడ్ ఫైల్స్’ అనే పేరు ప్రకటించారు.