వల్లభనేని వంశీ డేరింగ్ పై వర్మ కొత్త సినిమా

వల్లభనేని వంశీ డేరింగ్ పై వర్మ కొత్త సినిమా

0
99

వల్లభనేని వంశీ వైసీపీలో చేరడం అనేది అలాగ ఉంచితే, టీడీపీకి రాజీనామా చేయడం పై మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.. బాబుకి లోకేష్ కి అంత సన్నిహితంగా ఉండే వంశీ , టీడీపీకి గుడ్ బై చెప్పడం ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన విమర్శలు అదే రేంజ్ లో చేస్తున్నారు. ఇక వర్మ ఏపీ రాజకీయాలపై ఇక్కడ పరిస్దితులు పగలు పై అనేక సినిమాలు ప్లాన్ చేశారు ,తీశారు. రక్తచరిత్ర వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ తాజాగా ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.

ఈ చిత్రంలో ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులను అన్నింటిని కూడా కళ్ళకు కట్టినట్లు చూపిస్తానని ఇదివరకే ప్రకటించారు వర్మ .అలాగే ట్రైలర్ ఫోటోలు స్టిల్స్ లుక్స్ అన్నింటితో సోషల్ మీడియాలో విపరీతమైన బజ్ వచ్చింది.. ఈ సమయంలో టీడీపీకి గుడ్ బై చెప్పిన వంశీ మాటలు ఆయన ఆరోపణలు చూశారు వర్మ, దీంతో ఆయనకు ముగ్దుడయ్యాడు, ఆయనపై సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు వర్మ.

ఈ చిత్రానికి టైటిల్ కూడా డిసైడ్ చేశారు ఆర్జీవీ… రెడ్డి రాజ్యానికి కమ్మ ఫాన్స్ అంటూ చిత్రాన్ని ప్రారంభించనున్నారు.. మరి వర్మ ఒక సినిమాని లైన్ లో పెట్టి మరో సినిమాని ట్రాక్ లోకి తీసుకువస్తున్నారు అనే చెప్పాలి.