గద్దర్‌ పాటకి ఆర్జీవీ మాస్ స్టెప్పులు..వీడియో వైరల్‌

0
110

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘కొండా’. కొండా మురళి, సురేఖ జీవిత కథతో ఈ సినిమా రానుంది. ఈ సినిమాలో కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖపాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఈనెల 23న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈనెల 18న వరంగల్ లో జరిగింది. ప్రమోషన్‌ విషయంలో ఆర్జీవీ రూటే సెపరేట్. అందులో మళ్లీ ‘కొండా’ సినిమా కావడంతో ఏకండా స్టేజ్‌ ఫెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు ఆర్జీవి. గద్దరన్న పాటకు తనదైన శైలీలో స్టెప్పులేసి మెప్పించాడు. చేతిలో గన్ను పట్టి, ఎర్రటి టవల్‌ ధరించి, టోపీ పెట్టి స్టేజ్‌పై డాన్సర్లతో కలిసి డాన్సు చేసి అదరగొట్టారు. ఆయన తనదైన స్టయిల్‌లో స్టెప్పులేస్తూ, హవభావాలు పలికిస్తూ నవ్వులు పూయించారు.

అదే సమయంలో కాసేపు స్టేజ్‌ని షేక్‌ చేశారు. ఈవెంట్‌కి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. ప్రస్తుతం వర్మ డాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది.  ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

https://www.youtube.com/watch?time_continue=97&v=4kYFeaSIcdM&feature=emb_title