జగిత్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం..ఉద్రిక్తంగా మారిన రైతుల ధర్నా

0
36

తెలంగాణ: జగిత్యాల జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. గత వారం మంత్రి కేటీఆర్‌ పర్యటన సందర్భంగా..చెరకు రైతుల అరెస్ట్‌లపై వరుసగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే జగిత్యాలలోని చౌరస్తా వద్ద చెరకు రైతులు మరోసారి నిరసనకు దిగారు. దీనితో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఆందోళనలకు అనుమతి లేకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఆగ్రహించిన రైతులు డీఎస్పీని నెట్టివేశారు. దురుసుగా ప్రవర్తించారనే కారణంతో నిరసనకారులను పోలీసులు అరెస్ట్‌ చేసి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.