గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను స్వీకరించిన ఆర్జీవీ..ఫోటోలు వైరల్‌

0
113

తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా మొక్కలు నాటకం వాటిని సంరక్షించడం వంటివి చేస్తుంటారు. అయితే ఈ హరితహారం కార్యక్రమాన్ని కాస్త వినూత్నంగా రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గా ప్రారంభించారు.

ఇప్పటికే ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పలువురు ప్రముఖ సినీ, రాజకీయ, క్రీడ ఇతర రంగాల వారు పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఓ మొక్కను నాటి వారు ఇంకొందరికి ఈ ఛాలెంజ్ విసురుతారు. మళ్లీ వాళ్లు మొక్కలు నాటి వేరే వాళ్లకు మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసురుతారు.

తాజాగా ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ పాల్గొన్నాడు. ఆయన సీనియర్ జర్నలిస్ట్ స్వప్న విసిరిన ఛాలెంజ్ స్వీకరించారు. ఈ మేరకు హైదరాబాద్ శ్రీ నగర్ కాలనిలో మొక్క నాటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్‌ గా మారాయి.