Naatu Naatu Oscar |భారతీయులు ఎంతగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. అంతర్జాతీయ వేదికపై తెలుగు సినిమా సత్తా చాటింది. ఆస్కార్ అవార్డ్స్ కి నామినేట్ అవడమే కాదు అవార్డు దక్కించుకుంది. ఖండాంతరాలకు వ్యాపించిన తెలుగోడి ప్రతిభకు ఆస్కార్ పట్టం కట్టింది. హాలీవుడ్ దిగ్గజాల ప్రశంసలు పొందిన ‘RRR’కు ఆస్కార్ అవార్డు దక్కింది. USలోని లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరిగిన వేడుకలో ఈ మూవీలోని ‘నాటు నాటు’ పాట ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ కేటగిరీలో అవార్డు పొందింది. ఈ పాటను రాసిన చంద్రబోస్, సంగీత దర్శకుడు కీరవాణి వేదికపై అవార్డు అందుకున్నారు.
- Advertisement -
Read Also: ఆస్కార్ వేదికపై తెలుగోడికి అవమానం
Follow us on: Google News


