Flash: RRR విడుదల ఎప్పుడంటే?

rrr-movie-release-on-theatres-in-jan-7

0
90

ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకుడు. డీవీవీ దానయ్య నిర్మాత. వచ్చే ఏడాది సంక్రాంతికి ముందు జనవరి 7న విడుదల కానుంది. ‘దేశంలో భారీ యాక్షన్‌ డ్రామాను థియేటర్లలో చూసి అనుభూతి చెందండని శనివారం చిత్రబృందం వెల్లడించింది.

కరోనా వల్ల చిత్రీకరణ అనుకున్న సమయంలో పూర్తికాకపోవడంతో ఇప్పటికే మూడుసార్లు విడుదల వాయిదా పడిన ఈ చిత్రం జనవరి 7న రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఆలియా భట్‌, ఒలీవియా మోరిస్‌, అజయ్‌ దేవగణ్‌, శ్రియ నటించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీత దర్శకుడు.

అదేవిధంగా ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన ‘గంగూబాయి కథియవాడి’ జనవరి 6న విడుదల చేయన్నుట్టు దర్శక నిర్మాత సంజయ్‌ లీలా భనాల్సీ వెల్లడించారు.