Home BUSINESS రిలయన్స్‌ డిజిటల్‌ పండుగ ఆఫర్లు ఇవే..

రిలయన్స్‌ డిజిటల్‌ పండుగ ఆఫర్లు ఇవే..

0
160

హైదరాబాద్‌: ఈ పండుగ సీజను కోసం రిలయన్స్‌ డిజిటల్‌ ‘ఫెస్టివల్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌’ను తీసుకొచ్చింది. కొనుగోళ్లపై అద్భుత ఆఫర్లు, రాయితీలు ఇస్తున్నట్లు తెలిపింది. ‘అన్ని రిలయన్స్‌ డిజిటల్‌, మై జియో స్టోర్లతో పాటు www.reliancedigital.in వెబ్‌సైట్‌లో ఈ సేల్‌ అక్టోబరు 3న ప్రారంభమవుతుంది.

‘పేటీఎమ్‌ ద్వారా జరిపే రూ.4,999 కనీస చెల్లింపులపై రూ.1,000 వరకు క్యాష్‌బ్యాక్‌నూ పొందొచ్చు. వివిధ ఎలక్ట్రానిక్స్‌ విభాగాల్లోనూ వారెంటీ, క్యాష్‌బ్యాక్‌, తగ్గింపు ధరలు, ఎక్స్ఛేంజ్‌ బోనస్‌ లాంటి ప్రత్యేక ఆఫర్లు ఉన్నాయని వివరించింది.

వినియోగదార్లు జరిపే అన్ని ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు లావాదేవీలపై 10% తక్షణ రాయితీ (రూ.2000 వరకు) ఇస్తున్నాం. అక్టోబరు 3-12 మధ్య స్టోర్లలో చేసే కొనుగోళ్లకు, అక్టోబరు 3-10 మధ్య రిలయన్స్‌ డిజిటల్‌ వెబ్‌సైట్‌లో చేసే కొనుగోళ్లకు ఇది వర్తిస్తుందని తెలిపింది.