ఆర్.ఆర్.ఆర్. శాటిలైట్ హక్కులు మాములుగా లేవుగా..!!

ఆర్.ఆర్.ఆర్. శాటిలైట్ హక్కులు మాములుగా లేవుగా..!!

0
95

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు హీరోలుగా నటిస్తున్న చిత్రం RRR.. షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్ లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. అయితే రోజుకో రకమైన పుకార్‌తో అభిమానుల్లో సినిమాపై జోష్ ను నింపుతున్నారు.అయితే ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఓ విషయం టాక్ ఆఫ్ ఫిలింనగర్‌గా మారింది. ఇది వాస్తవమెంతో.. అవాస్తవమెంతో కాని ఆర్ ఆర్ ఆర్ సినిమాకు శాటిలైట్ హక్కులు వింటే గుండె గుభేల్ అనాల్సిందే..

అసలు సినిమాను రూ.250 నుంచి రూ.300కోట్ల బడ్జెట్‌తో రూపొందిస్తున్నారనే సమాచారం ఫిలింనగర్ వర్గాల టాక్‌. కానీ ఇంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ నటులు, ప్రముఖ దర్శకుడు కాంబీనేషన్ కావడంతో సినిమాపై భారీ హైప్ క్రియోట్ అవుతూనే ఉంది. ఇక బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో సినిమా యావత్ దేశం ఎదురుచూస్తుంది..