RRR లో తార‌క్ తండ్రి పాత్ర చేసేది ఆయ‌నేనా ?

RRR Movie Updates

0
118
RRR Wins Best Original Song

మెగా, నందమూరి ఫ్యాన్స్ RRR సినిమా కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. బాహుబ‌లి త‌ర్వాత ఇంత‌లా దేశం ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా కోసం జ‌క్క‌న్న ఎన్నో జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.ఇక ఈ ఇద్దరి రోల్స్ ఎక్కడా హెచ్చుతగ్గులు లేకుండా బ్యాలెన్స్ చేస్తూ కథపై కసరత్తులు చేసి జ‌క్క‌న్న అద్భుతంగా చూపించ‌బోతున్నారు.

అయితే ఈ సినిమా గురించి రోల్స్ గురించి చాలా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆర్ ఆర్ ఆర్ టీమ్ మాత్రం ఈ విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంది. తాజాగా మరో ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

ఈ చిత్రంలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామ‌ రాజుగా రామ్‌చ‌ర‌ణ్ కనిపించబోతున్నారు.
ఇక బాలీవుడ్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్‌ ఇందులో ముఖ్యపాత్ర పోషిస్తున్నట్లు గతంలోనే అఫీషియల్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే తాజాగా వినిపిస్తున్న వార్త‌ల ప్ర‌కారం ఇందులో అజ‌య్ దేవ‌గ‌ణ్
కొమురం భీమ్ తండ్రి పాత్ర‌లో అంటే ఎన్టీఆర్ తండ్రి పాత్ర‌లో నటిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఈ సినిమాలో ఆయ‌న పాత్ర చాలా హైలెట్ అవుతుంది అని అంటున్నారు. మ‌రి చూడాలి జ‌రుగుతున్న ప్ర‌చారం నిజ‌మా కాదా అనేది క్లారిటీ వ‌చ్చే వ‌ర‌కూ.