‘RRR’ ప్రభంజనం..మూడు రోజుల్లోనే ఎన్ని కోట్లు కొల్లగొట్టిందంటే?

0
117

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘RRR’. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్.. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించారు. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన ట్రిపుల్ ఆర్ నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది.

తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమా కలెక్షన్లలో దుమ్ములేపుతుంది. తొలి రోజే రూ.223కోట్లు సాధించి ‘బాహుబలి’ రికార్డులను అధిగమించిన ఈ మూవీ మూడు రోజులు పూర్తయ్యేసరికి సరికొత్త బెంచ్​మార్క్​ను సెట్​ చేసింది.

ప్రపంచవ్యాప్తంగా రూ.500కోట్ల వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని సినీవిశ్లేషకుడు తరణ్​ ఆదర్శ్ సోషల్​మీడియా ద్వారా తెలిపారు. కనీసం మరో వారం రోజుల పాటు మరో పెద్ద సినిమా లేదు కాబట్టి, కలెక్షన్లు ఇదే స్పీడ్‌లో కొనసాగితే పోస్ట్-పాండమిక్ రికార్డ్‌ను క్రియేట్ చేసే సత్తా ఈ సినిమాకి ఉంది.