Oscar Committee | ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి మరో అరుదైన గౌరవం

-

Oscar Committee | దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏకంగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు సాధించి భారత సినిమా స్థాయిని పెంచింది. తాజాగా.. మరోసారి ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి అరుదైన ఘనత లభించింది. లాస్ ఏంజెల్స్ – ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డులను ప్రదానం చేసే ‘ద అకాడమీ ఆఫ్ మోషనల్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్’ కొత్తగా ఆస్కార్ కమిటీ(Oscar Committee)లో 398 మందికి సభ్యత్వం కల్పించింది. ఆ జాబితాను తాజాగా విడుదల చేసింది. ఇందులో ‘ఆర్ఆర్ఆర్’ టీంకు చెందిన ఆరుగురు ఉండటం విశేషం. స్టార్ నటులు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ తోపాటు సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి , గేయ రచయిత చంద్రబోస్, ఛాయాగ్రాహకుడు సెంథిల్, ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ లకు ఈ కమిటీలో స్థానం దక్కింది. ఇక బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు కూడా స్థానం లభించింది.

- Advertisement -
Read Also:
1. డైట్ లో ఉన్నవారికి కొవ్వు లేని బెస్ట్ చిరుతిళ్ళు
2. తలనొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చిట్కాలు ట్రై చేయండి

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

40 ఏళ్లు పోలీసులను బురిడీ కొట్టించిన ఖైదీ

నలభై ఏళ్ల నుంచి బురిడీ కొట్టించి తప్పించుకుని తిరుగుతున్న ఖైదీ ఎట్టకేలకు...

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...