ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ఏమిటో తెలుసా రాజమౌళి ఆలోచన ఇదే

ఆర్ ఆర్ ఆర్ టైటిల్ ఏమిటో తెలుసా రాజమౌళి ఆలోచన ఇదే

0
98

బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ..అదే అన్ టైటిల్ సినిమా.. అయితే ఈ సినిమాలో చాలా కొత్తదనంగా చరణ్ ఎన్టీఆర్ ని చూపిస్తున్నారు రాజమౌళి, అయితే ఈ మల్టీస్టారర్ చిత్రం దాదాపు సగం వరకూ షూటింగ్ పూర్తి చేసుకుంది.

అయితే అందరికి ఈ సినిమా ప్రారంభించిన సమయం నుంచి టైటిల్ ఏం పెడతారు అనేది ఆలోచన.. అయితే ఈ సినిమా టైటిల్ గురించి చాలా మంది ఇదే పేరు ఉంచుతారా వీరి పేర్లు మొదటి అక్షరాలతో ఆర్ ఆర్ ఆర్ అని మరి కొందరు క్రియేట్ చేశారు… చిత్ర యూనిట్ కూడా అదే ఫాలో అవుతోంది.

కాని ఈ సినిమా గురించి తాజాగా రామ రావణ రాజ్యం అని పేరు వినిపించింది..
కాని తాజాగా రఘుపతి రాఘవ రాజారాం అనే పేరుని ఆలోచిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి, ఇది భక్తి గీతం, గాంధీకి ఇష్టమైన గీతం అందుకే ఇది బాగా పాపులర్ అయింది.. ఎలాగో చిత్రం స్వాతంత్య్ర ఉద్యమం బ్యాగ్రౌండ్ కాబట్టి ఈ టైటిల్ బెటర్ అని ఆలోచన చేస్తున్నారట