దిశ ఘటన జరిగిన చోట ప్రభుత్వం ఏం ఏర్పాటు చేసిందో చూస్తే శభాష్ అంటారు

దిశ ఘటన జరిగిన చోట ప్రభుత్వం ఏం ఏర్పాటు చేసిందో చూస్తే శభాష్ అంటారు

0
43

దిశ ఘటన మన దేశంలో పెద్ద సంచలనం అయింది.. గతేడాది నవంబరులో జరిగిన దిశ ఘటన దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలకు దారి తీసింది, అయితే ఆనలుగురు మానవ మృగాలను ఎన్ కౌంటర్ లో చంపేశారు పోలీసులు.

చివరకు ఆమె చివరి చూపు లేకుండా ఈ దుర్మార్గులు పెట్రోలు పోసి సజీవ దహనం చేశారు . ఈ ఘటన హైదరాబాద్ శివారు, చటాన్పల్లి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు కింద అండర్ పాస్ రహదారిపై జరిగింది. అయితే ఇలా జరగడానికి కారణం అక్కడ చీకటిగా ఉండటం… అందుకే అక్కడ జనసంచారం కూడా ఉండదు. రాత్రి ఎవరూ అటు వెళ్లరు కాని అక్కడ ఇలాంటి ఇబ్బందులు రాకూడదు అని అలా అండర్ పాస్ ఉన్న ప్రాంతాలు అన్నీ చూసి లైట్లు ఏర్పాటు చేశారు.

ఇప్పుడు దివ్యకాంతి అక్కడ కనిపిస్తుంది.. అండర్ పాస్లలో అమర్చిన లైట్లకు సంబంధించి ఫోటోలను అధికారులు ట్వీట్ చేశారు.ఔటర్ రింగు రోడ్డు అంతటా ఉన్న అండర్ పాస్ రహదారుల్లో ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేశారు.. ఈ నిర్ణయం మంచిదే అని చెప్పాలి. ఇవన్నీ సోలార్ తో పని చేయనున్నాయని చెబుతున్నారు.