Sai Pallavi | `ఆ సినిమాను తలుచుకొని ఎమోషనల్ అయిన సాయిపల్లవి

-

రాణా దగ్గుబాటి(Rana)-సాయి పల్లవి(Sai Pallavi) కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నక్సలిజం బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది జూన్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా విడుదలయ్యి నిన్నటికి ఏడాది పూర్తి కావడంతో సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా ఈ సినిమా గురించి చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమాలో సాయి పల్లవి వెన్నెల పాత్రలో నటించి సినిమా మొత్తాన్ని తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు. ఈ సినిమాలో సాయి పల్లవి నటనకు అందరూ ఫిదా అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ విమర్శకుల నుంచి ప్రశంసలు మాత్రం అందుకుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదల ఏడాది కావడంతో సాయి పల్లవి(Sai Pallavi) సోషల్ మీడియా వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ షేర్ చేస్తూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా సాయి పల్లవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ విరాటపర్వం(Virataparvam) సినిమా తన మనసుకు చాలా దగ్గరైన సినిమా అని చెప్పుకొచ్చారు.

- Advertisement -
Read Also:
1. ఎంత కన్విన్స్ చేసినా తప్పలేదు.. ఆదిపురుష్‌లో ఆ డైలాగ్స్ తొలగింపు

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Sesame Seeds | చలికాలంలో తెల్ల నువ్వులు ఎంత మ్యాజిక్ చేస్తాయో తెలుసా..

Sesame Seeds | చలికాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా పెద్ద టాస్క్...

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...