రెజీనాతో అఫైర్ పై స్పందించిన సాయితేజ్

రెజీనాతో అఫైర్ పై స్పందించిన సాయితేజ్

0
74

మెగా హీరోలకు సినిమా హీరోయిన్ల మధ్య అఫైర్లు ఉన్నాయి అనే వార్తలు గుసగుసలు ఎప్పుడూ వినిపించవు.. కాని సుప్రీం హీరో సాయి తేజ్ రెజీనా మధ్య సంథింగ్ సంథింగ్ అనే వార్తలు గుసగుసలు ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉన్నాయి ..దీనికి బీజం పడింది. పిల్లా నువ్వు లేని జీవితం సినిమాతో.. ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంలో కూడా ఇద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి వీరిద్దరి మధ్య అఫైర్ ఉంది అని వార్తలు వస్తూనే ఉన్నాయి. అంతేకాదు వీరికి బ్రేక్ అప్ కూడా ఇటీవల అయింది అని చెబుతున్నారు. ఇక సమయం వచ్చినప్పుడు మాట్లాడుదాం అనుకున్నారేమో దీనిపై ఎలాంటి మాటలు మాట్లాడలేదు ఇద్దరూ. తాజాగా దీనిపై సాయి తేజ్ స్పందించారు.

చిత్రలహరి ప్రచార కార్యక్రమంలో భాగంగా స్పందించారు. రెజీనా తనకు మంచి ఫ్రెండ్ మాత్రమేనని, ఆమె కెరీర్ నాశనం కాకూడదనే ఉద్దేశంతో ఇన్ని రోజులూ ఈ విషయంపై స్పందించలేదని స్పష్టత ఇచ్చారు.
తనతో డేటింగ్ చేస్తున్నాను అని వినిపిస్తున్న వార్తల్లో వాస్తవం లేదు అని, కేవలం రూమర్స్ మాత్రమే అని ఇలాంటివి దయచేసి స్ర్పెడ్ చేయవద్దు అని తెలియచేశారు తేజ్.. ఇప్పుడు నేను నా వృత్తిపైనే ఫోకస్ చేశాను అని తెలియచేశారు. తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే అని అన్నారాయన. వాస్తవానికి ఈ రూమర్ పుట్టడానికి గల కారణం కూడా సాయి తేజ్ అనే చెప్పాలి.. 2017లో ఓ సందర్భంలో సాయి తేజ్ మాట్లాడుతూ రెజీనాను తాను రహస్యంగా పెళ్లిచేసుకున్నానని సరదాగా అన్నారు.. అది పట్టుకుని రకరకాల వదంతులను సృష్టించేశారు. ఇప్పుడు రెజీనా తెలుగులో బాలీవుడ్ కోలీవుడ్ లో కూడా నటిస్తూ బీజీ అయ్యారు.