కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న శైలజ రెడ్డి అల్లుడు

కలెక్షన్ల సునామి సృష్టిస్తున్న శైలజ రెడ్డి అల్లుడు

0
160

సెప్టెంబర్13న విడుదలైన శైలజారెడ్డి అల్లుడు మూడు రోజుల్లో 23 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించి కెరీర్ బెస్ట్ వసూళ్లని సాధించాడు అక్కినేని నాగచైతన్య. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని సితార ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై నిర్మించారు. నాగచైతన్య సరసన అను ఇమాన్యుఎల్ నటించగా అత్తగా రమ్యకృష్ణ నటించింది. మొదటిరోజున 12 కోట్లు వసూల్ చేసిన శైలజారెడ్డి అల్లుడు రెండో రోజు , మూడో రోజు కూడా అదే జోరు చూపించడంతో 3 రోజుల్లో 23 కోట్ల వసూళ్లు వచ్చాయి. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఈరోజు కూడా మంచి వసూళ్లు రావడం ఖాయం దాంతో 28 లేదా 30 కోట్ల గ్రాస్ వసూళ్లు రావచ్చు . అయితే శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి రేపటి నుండి అసలు పరీక్ష మొదలుకానుంది. రేపటి నుండి కూడా మంచి వసూళ్లు వస్తే తప్పకుండా హిట్ దిశగా దూసుకుపోయినట్లే .

నాగచైతన్య అదృష్టం ఏంటంటే మరో వారం వరకు సరైన సినిమాలు లేవు అలాగే పెద్ద సినిమాలు కూడా రావడానికి ఇంకా చాలా రోజుల సమయం పడుతుంది కాబట్టి వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉంది. అలా వసూల్ చేసినట్లయితే శైలజారెడ్డి అల్లుడు లాభాలబాటలో పయనించినట్లే ! 24 కోట్ల బిజినెస్ జరిగింది శైలజారెడ్డి అల్లుడు చిత్రానికి అయితే ఇప్పటి వరకు 12 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది అంటే సగం రాబట్టినట్లు. మిగతా సగం వస్తే బయ్యర్లు సేఫ్ జోన్ లోకి వస్తారు. వాళ్ళు సేఫ్ జోన్ లోకి రావాలంటే ఈ వారం రోజులు శైలజారెడ్డి అల్లుడు కుమ్మేయ్యాలి. సరైన సినిమా ఏది కూడా పోటీలేదు కాబట్టి చైతూ ఆ వసూళ్లు సాధిస్తాడేమో చూడాలి.