ఈ కులాలు, పరువు హత్యలు ఏంట్రా జంగిల్ ఫెలోస్

ఈ కులాలు, పరువు హత్యలు ఏంట్రా జంగిల్ ఫెలోస్

0
109

తెలంగాణ లో మిర్యాలగూడలో దళిత కులానికి చెందిన ప్రణయ్‌ను అమ్మాయి తండ్రి హత్య చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై రామ్ తన మనసులోని ఆవేదనను బయట పెట్టారు.ఇక తాజాగా ఈ ఉదంతం పై టాలీవుడ్ హీరో రామ్ పోతినేని తన ట్విట్టర్ద్వా రా స్వలింగ సంపర్కాన్ని నిషేధించే సెక్షన్ 377నే ఎత్తేశారని, ఇంకా కులం, పరువు పేరుతో హత్యలేంటని అతడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘377నే ఎత్తేస్తే ఇంకా ఈ కులాలు, పరువులు హత్యలు ఏంట్రా జంగిల్ ఫెలోస్.. దయచేసి మనుషులుగా బతకండి.. ’ అని అన్నాడు.

మరోపక్క.. గాయని చిన్మయి స్పందిస్తూ..‘ ఇలాంటి దారుణాలు జరక్కుండా మనవంతు ప్రయత్నంగా కులాలను నిర్మూలించాలి.. పేర్ల చివరఉండే తోకలు కట్ చేయాలి..’ అని అంది. నటి పూనమ్ కౌర్ కూడా విరుచుకుపడింది. ’ఈ హత్యలతో ఏం సాధిస్తారు? అమృత–ప్రణయ్ జంటకు న్యాయం జరిగేది ఎప్పుడు? మనం నిజంగానే 21వ శతాబ్దంలో ఉన్నామా?’ అని ప్రశ్నించింది.