మరో రికార్డు సృష్టించిన రంగస్థలం మూవీ

మరో రికార్డు సృష్టించిన రంగస్థలం మూవీ

0
90

రామ్ చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా లో సమంత హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సినిమాలోని రంగమ్మా మంగమ్మా సాంగ్ యూట్యూబ్ ను షేక్ చేస్తుంది.

ఈ పాట సోషల్ మీడియాలో 10 కోట్ల వ్యూస్ ను దాటేసి రికార్డు పుటల్లోకి ఎక్కింది.. సమంత క్యూట్ మూమెంట్స్ ఈ పాటకు అందాన్ని తెచ్చాయి. ఇక దేవి మ్యూజిక్ అంతే కిక్ ఇచ్చింది. బాహుబలి-2, ఫిదా వచ్చిందే సినిమాల తర్వాత యూట్యూబ్ ను షేక్ చేసిన పాట ఇదే అని చెప్పొచ్చు.ఇక సినిమా కూడా నాన్ బాహుబలి రికార్డుల్లో సరికొత్త సంచలనం సృష్టించింది. 125 కోట్ల షేర్ తో రాం చరణ్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది రంగస్థలం.